ప్రిజ‌ర్వేటివ్స్ ఉన్న ఆహారాల‌ను అధికంగా తీసుకుంటే గుండె జ‌బ్బుల ముప్పు..

గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా కొనసాగుతున్నాయి. ఆహారపు అలవాట్లు గుండె ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతాయని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో ప్రాసెస్డ్ ఆహారాల్లో ఉపయోగించే కొన్ని సాధారణ ప్రిజర్వేటివ్‌లు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అవకాశముందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫ్రాన్స్‌కు చెందిన న్యూట్రినెట్-సాంటే (NutriNet-Santé) పరిశోధనలో లక్ష మందికిపైగా వ్య‌క్తుల‌ను పరిశీలించారు. ఈ ఏడాది మే 20న ప్రచురితమైన ఈ అధ్యయనంలో కొన్ని ఆహార ప్రిజర్వేటివ్‌లకు ఎక్కువగా గురైన వారిలో గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఏయే ప్రిజ‌ర్వేటివ్‌ల‌ను గుర్తించారు.. పరిశోధకులు గుండె ఆరోగ్యానికి సంబంధం...