డిజిటల్ గవర్నెన్స్‌తో పారదర్శక పరిపాలన అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జులై 7 (): కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) సచివాలయంలో ఈరోజు(మంగళవారం) ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన చట్టాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పరిపాలన వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేస్తూ ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని సీఎం సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందించేందుకు వివరాలను...