ఘనంగా దండు మారెమ్మ జాతర ఉత్సవాలు

.. - అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట, జూలై 7( బి వి కే న్యూస్ ) మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామంలో గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ మారెమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు...