కేతపల్లి ప్రభుత్వ పాఠశాలలో రీఓపెనింగ్ నిర్వహించిన ఎంఈఓ
దేవరకొండ 07జూలై (BVK 3 న్యూస్ ) : రాష్ట్ర ప్రభుత్వ హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియలో భాగంగా విలీనమైన ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరానికి సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. నేరడుగొమ్ము మండలంలో గతంలో కొనసాగిన 18 ప్రభుత్వ పాఠశాలలు విలీనమవగా,ప్రస్తుతం కేతపల్లి,ధర్మరేఖ తండా, వైజాగ్ కాలనీ,బచ్చాపురం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే విద్యాబోధన కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో కేతపల్లి ప్రభుత్వ పాఠశాలలో రీఓపెనింగ్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) బ్రహ్మచారి పాఠశాలను పునఃప్రారంభించి విద్యార్థులకు పూలు అందజేస్తూ ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం తరగతి గదులు, తాగునీటి సౌకర్యం,మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, పరిశుభ్రత,పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర అంశాలను పరిశీలించి ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు...