ఘనంగా టీజీ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం - దేవరకొండలో జెండా ఆవిష్కరణ

దేవరకొండ 07జూలై (BVK 3 న్యూస్ ) : తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టీజీ ఎమ్మార్పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మేడి పాపన్న గారి ఆదేశాల మేరకు దేవరకొండలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకొండ రెండో వార్డులో ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ​ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు కోతేం సహదేవులు మాట్లాడుతూ, "సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన, ఎస్సీ వర్గీకరణ అమలు మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎమ్మార్పీఎస్ నిరంతరం పోరాడుతోంది. ఈ ఉద్యమ స్ఫూర్తిని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లి, సంస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం...