ప్రతి ఓటును కాపాడటం బీఎల్ఏల బాధ్యత: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ 07జూలై (BVK 3 న్యూస్ ) : చందంపేట, నేరేడుగొమ్ము మండలాల కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ లు), ముఖ్య నాయకులతో నిర్వహించిన ఎస్ఐఆర్ విధానంపై అవగాహన సదస్సులో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి బూత్‌లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బీఎల్ఏ లు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బీఎల్ఏ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మరియు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్...