ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలి: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ 07జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా తన ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్ఓ) కు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని, తమ ఓటు వివరాలను పరిశీలించుకుని అవసరమైనట్లయితే ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి నిర్ణీత గడువులోపు సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటరు జాబితాలో పేరు సక్రమంగా ఉండటం ద్వారా మాత్రమే...