నిర్లక్ష్యంలో నీరో చక్రవర్తిని మించిపోయారు..
ఒకపక్క నీళ్లు లేక పల్లెల్లో రైతన్నల కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. మరోపక్క మేడిగడ్డ కాడ లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందకు పోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంలో నీరో చక్రవర్తిని మించిపోయి సర్కారు తమాషా చూస్తున్నదని మండిపడ్డారు.Politics వానల్లేక.. ఎవుసం జరగక అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించడం లేదా? కాళేశ్వరం దగ్గర పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను ఎత్తిపోసి..గోస తీర్చాలన్న సోయి కలగట్లేదా? అని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. లోటు వర్షపాతంతో నాట్లు పడట్లేదు.. విత్తనాలు వేయట్లేదు.. పంటలు సాగుచేసే పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వమేమో ఏమీ పట్టించుకోకుండా దున్నపోతు మీద వానపడ్డట్టే వ్యవహరిస్తున్నదని తెలిపారు....