16వ వార్డులో సర్- హెల్ప్ డెస్క్ ప్రారంభించిన వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని..
నారాయణపేట, జూలై 8( బి వి కే న్యూస్) మక్తల్ మున్సిపాలిటీ 16 వ వార్డులో సర్...ఓటరు జాబితా సవరణ ప్రక్రియ లో భాగంగా... మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు.. వార్డులోని ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటరు ఫామ్ లు నింపడం కోసం హెల్ప్ డెస్క్ ను బుధవారం స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్ ప్రక్రియ అత్యంత కీలకమని, ఒక్క తప్పు కూడా లేకుండా, సర్ ప్రక్రియ లో భాగంగా ఓటరు ఫారాలను అడిగిన అన్ని వివరాలు జోడించి, ఫారాలను బీఎల్వోలకు నిర్ణీత సమయంలో అందించాలని సూచించారు. సర్ ప్రక్రియ లో భాగంగా...