దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
దేవరకొండ 08జూలై (BVK 3 న్యూస్ ) :దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం ఎన్నికల ప్రత్యేక సమ్మతి సవరణ (ఎస్ఐఆర్ ) కార్యక్రమంపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేవరకొండ ఈఆర్ఓ మరియు ఆర్డీఓ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా జరగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా : ఫారాల పూరణ (ఫారం ఫిల్లింగ్ ): కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులకు సంబంధించిన ఫారాలను ఏ విధంగా నింపాలి అనే అంశంపై వివరించారు. డిజిటలైజేషన్ ప్రక్రియ: ఓటర్ల సమాచార సేకరణలో డిజిటలైజేషన్ ప్రాధాన్యతను, ఆన్లైన్ నమోదు...