నల్లగొండ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ - జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యురాలు యేకుల అనిత సురేష్

దేవరకొండ 09జూలై (BVK 3 న్యూస్ ) : నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ రెండవ సమావేశంలో కమిటీ సభ్యురాలు యేకుల అనిత సురేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని పలు కీలక సమస్యలను గౌరవ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్లాను. స్టేషన్ల వద్ద ఇబ్బందులు: బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లి పిటిషన్ ఇస్తే, ఎస్సై లేరనే సాకుతో వారిని తిరిగి పంపిస్తున్నారని ఎస్పీ గారికి తెలియజేశాను. ఎస్సై ఉన్నప్పుడే రావాలని చెప్పడం వల్ల బాధితులు పలుమార్లు స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, వారి...