వారానికి ఒక్క ఇంజెక్షన్‌తో మధుమేహ నియంత్రణ..

డెన్మార్క్‌కు చెందిన ఔషధ సంస్థ నోవో నోర్డిస్క్, ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన భయాన్ని తగ్గిస్తూ, వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే కొత్త బేసల్ ఇన్సులిన్ అవిక్లీ (ఇన్సులిన్ ఐకోడెక్)ను భారత్‌లో విడుదల చేసింది. ప్రపంచంలో ఈ ఔషధాన్ని ప్రవేశపెట్టిన ఆరో దేశంగా భారత్ నిలిచింది. కంపెనీ తెలిపిన ప్రకారం, ఇది ప్రపంచంలోనే తొలి వారానికి ఒక్కసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్ ఇంజెక్ష‌న్ కావ‌డం విశేషం. ఈ చికిత్సతో ఏడాదిలో తీసుకోవాల్సిన ఇంజెక్షన్ల సంఖ్య 365 నుంచి కేవలం 52కు తగ్గుతుంది. టైప్-1, టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న వారికి ఈ ఔషధానికి అనుమతి లభించింది. నోవో నోర్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మాట్లాడుతూ...