దేవరకొండ రిటైర్డ్ ఉద్యోగుల సేవాసదనం నిర్మాణానికి దాతల చేయూత: రూ. 10,116/- విరాళం అందజేసిన కర్నాటి పాపయ్య దంపతులు.
దేవరకొండ 09జూలై (BVK 3 న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సేవాసదనం మొదటి అంతస్తూ నిర్మాణ నిధికి దేవరకొండ వాస్తవ్యులు కర్నాటి పాపయ్య-ఆండా ళమ్మ రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గురువారం జరిగిన సమావేశంలో అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ,కోశాధికారి పంగునూరు లింగయ్యలకు రూ. 10,116/- ల చెక్కు అందజేసినారని ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్ తెలియజేసినారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి, సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య, కార్యనిర్వాహాక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్ మాట్లాడుతూ దాతల ఆర్థిక సహకారంతో త్వరలో భవనం పూర్తి చేస్తామని తెలియజేసినారు. జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల నారాయణ రెడ్డి మాట్లాడుతూ 70 సంవత్సరాలు నిండని...