రేపు రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్: ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్ఎఫ్ పిలుపు
దేవరకొండ 09జూలై (BVK 3 న్యూస్ ) : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జులై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ,ఏఐఎస్ఎఫ్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు బుడిగ వెంకటేష్,వట్టేపు శివ కుమార్ పిలుపునిచ్చారు. దేవరకొండ పట్టణంలో నిర్వహించిన పత్రిక ప్రకటన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వం కాలేజీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వేలాది మంది విద్యార్థులు చదువును కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.అదేవిధంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను...