దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ భద్రతపై అవగాహన సదస్సు

దేవరకొండ 09జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ధన్ ఫౌండేషన్ సిఎఫ్ఎల్ కోఆర్డినేటర్ రాపర్తి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో డిజిటల్ భద్రత,ఆర్థిక అక్షరాస్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు,ఆన్లైన్ మోసాలు,సైబర్ నేరాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవల సురక్షిత వినియోగం, యుపిఐ లావాదేవీలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు ఉపయోగించే వివిధ మోసపూరిత పద్ధతులను వివరించి వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకూడదని సూచించారు.అనుమానాస్పద లింకులు,ఫోన్ కాల్స్, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.విద్యార్థు లు ఆసక్తిగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి...