దేశ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర
- ప్రతీ విద్యార్థి జాతీయవాద దృక్పథాన్ని అలవర్చుకోవాలి - విద్యార్థి శక్తిని జాతీయ శక్తిగా మార్చడంలో ఏబీవీపీ నిరంతర కృషి అభినందనీయం - జాతీయ పునర్నిర్మాణంలో ఏబీవీపీ తో విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలి - పిలుపునిచ్చిన ఆర్ ఎస్ ఎస్ విభాగ్ ప్రచారక్ దేవేందర్ నారాయణపేట, జూలై 9 (బివికె న్యూస్) దేశ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్రని, ప్రతీ విద్యార్థి జాతీయవాద దృక్పథాన్ని అలవర్చుకోవాలనీ,విద్యార్థి శక్తిని జాతీయ శక్తిగా మార్చడంలో ఏబీవీపీ నిరంతర కృషి అభినందనీయమని,జాతీయ పునర్నిర్మాణంలో ఏబీవీపీ తో విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలనీ పిలుపుచ్చారు ఆర్ ఎస్ ఎస్ విభాగ్ ప్రచారక్ దేవేందర్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా...