ఓ మనిషి
ఏకాగ్రతే నీవిజయం చంచలమైన ఈ జగత్తులో మనిషి మనసుస్థిరంగా ఉండదు పలు ఆలోచనలతో నిరంతరం ఒత్తిడికి గురై ఆందోళన సుడిగుండంలో చిక్కుకుని కుంగుబాటుకు మనసు కుదేలౌతుంది చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్లు మనిషి ఉన్న చోట మనసు ఉండదు పలు కోర్కెలు మనసులో పరుగులు తీస్తూ సమస్యల సుడి గుండాన్ని సృష్టిస్తాయి ఓ మనిషి నీమనసును అదుపులో పెట్టుకో నీ మనసు ఎటుపోతోందో చూడు స్థిరత్వం లేని ఆలోచనలు మానుకొని నీగమ్యం వైపుదృష్టి నిలుపు ఏకాగ్రత జీవిత లక్ష్య సాధనకు చుక్కాని ఏకాగ్రత కోల్పోతే సర్వం శూన్యం ఏకాగ్రత మనసును నిలిపే మహా యోగం లక్ష్యాన్ని చేరే దివ్యమార్గం సిరిసంపదలు ఏకాగ్రతకు...