మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీస్ నారాయణపేట, జూలై 10 (బి వి కే న్యూస్ ) నారాయణపేట జిల్లాలో మహిళలు, యువతులు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, బాలికలు ఆకతాయిల వేధింపులు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, గృహహింస, లైంగిక వేధింపులు లేదా ఇతర ఏ విధమైన అన్యాయాలకు గురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని కోరారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, పార్కులు, ప్రజా ప్రదేశాలు, గ్రామాలు, కాలనీలు, కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో మహిళలు,...