ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి
నారాయణపేట, జూలై 10 (బి వి కే న్యూస్) రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీ హరి ఆదేశాల మేరకు మక్తల్ 12,వ వార్డు కు సంబంధించిన నూతన ఇందిరమ్మ ఇంటి గృహాన్ని శుక్రవారం రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ట సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 15 సంవత్సరాలలో గత ప్రభుత్వ హాయంలో ఏ ఒక్క ఉచిత ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు ఎంతో నమ్మకంతో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ...