మక్తల్ ల్లో ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

- కేక్ కట్ చేస్తూ మత్సకారుల దినోత్సవం జరుపుకున్న మత్స్యకారులు నారాయణపేట, జూలై 10 (బి వి కే న్యూస్) జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలోని మత్స్యశాఖ భవన్ లో మత్స్యకారుల దినోత్సవం వేడుకలను సొసైటీ అధ్యక్షులు కోళ్ల వెంకటేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా, సముద్రం, నదులు, చెరువులు ఆధారంగా జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సేవలను గుర్తు చేసుకుంటూ అసువులు బాసిన వారికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో, ఆహార భద్రతలో, గ్రామీణ ఉపాధి కల్పనలో మత్స్యకారుల పాత్ర ఎంతో కీలకమైనది....