ఒంట‌రిత‌నంతో జీవిస్తే మెద‌డు ఆరోగ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డే అవ‌కాశం..

ఒంటరితనం అనేది కేవలం మనసును మాత్రమే కాదు, మెదడు ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసే సమస్యగా తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎక్కువ కాలం పాటు సామాజిక సంబంధాలకు దూరంగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే శక్తి క్రమంగా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, దీర్ఘకాలంలో చిత్తవైకల్యం (డిమెన్షియా) వంటి నరాల సంబంధిత వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంద‌ని చెబుతున్నారు. సామాజిక సంబంధాలు మెదడు చురుకుదనాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో తరచూ మాట్లాడటం, అనుభవాలను పంచుకోవడం, కొత్త విషయాలపై చర్చించడం వంటి చర్యలు మెదడులోని వివిధ భాగాలను ఉత్తేజపరుస్తాయి. అయితే, ఎక్కువ కాలం...