నిజామాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్..
వినాయక నగర్, జూలై 11: నిజామాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్ సృష్టించింది. ఒకే రాత్రి నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టాటా సుమోలో వచ్చిన నలుగురు దొంగలు ముందుగా నిర్మల్ జిల్లాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దోపిడీకి పాల్పడ్డారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించి, తెల్లవారుజామున ఆర్మూర్ పట్టణంలోని ఓ మెడికల్ షాప్ షట్టర్ ధ్వంసం చేసి అందులోని సుమారు లక్షన్నర నగదును దోచుకున్నారు. అనంతరం ఆ దొంగల ముఠా తమ వాహనంలో తెల్లవారుజామున 4.55 గంటల వరకు శ్రీనగర్ కాలనీకి చేరుకుని.. లక్ష్మీ అనే మహిళ మెడలో నుంచి రెండు...