మైనంపల్లి గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో మంచినీటి కొరత: స్పందించిన సర్పంచ్ రామ్ సింగ్ నాయక్

దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) : మైనంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర మహిళా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో తీవ్రమైన మంచినీటి కొరత ఏర్పడటంతో, విద్యార్థుల ఇబ్బందులను గమనించిన గ్రామ సర్పంచ్ రామ్ సింగ్ నాయక్ తక్షణమే స్పందించారు. కళాశాలలో నీటి సమస్యను పరిష్కరించేందుకు, తన సొంత చొరవతో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయించారు.నీటి ఎద్దడి వల్ల విద్యార్థినులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సర్పంచ్ చేసిన ఈ సహాయాన్ని కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు అభినందించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మాసారాం అంబేద్కర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరిప్రియ, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల...