దేవరకొండలో ఓటర్ల కోసం ప్రత్యేక 'హెల్ప్ డెస్క్' ప్రారంభం

దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) : ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, దేవరకొండలోని టిటిడి కళ్యాణమండపం వద్ద ఓటర్ల కోసం ప్రత్యేక 'హెల్ప్ డెస్క్'ను ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్‌ను దేవరకొండ తహశీల్దార్ సంజీవ్ కుమార్ ప్రారంభించారు.ఓటర్ల నమోదు, ఓటరు కార్డులో సవరణలు, చిరునామా మార్పులు మరియు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక ప్రజలకు వేగంగా అందించడం ఈ హెల్ప్ డెస్క్ ముఖ్య ఉద్దేశ్యం. దరఖాస్తుల స్వీకరణ, ధ్రువీకరణ ప్రక్రియలో ఎలాంటి సందేహాలున్నా ప్రజలు నేరుగా ఈ హెల్ప్ డెస్క్‌ను ఆశ్రయించవచ్చని తహశీల్దార్ తెలిపారు. అందుబాటులో ఉన్న బి.ఎల్.ఓ బృందం:ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిపుణులైన అధికారులను నియమించారు. వీరు నిత్యం...