ముక్కమల్ల వెంకటయ్య గౌడ్ ని ఘనంగా సన్మానించిన నాయకులు

దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) : కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులుగా ముక్కమల్ల వెంకటయ్య గౌడ్ నియమించిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.ముక్కమల్ల వెంకటయ్య మాజీ మార్కెట్ చైర్మన్ గా సేవలందించారు.ఆయన సేవలను దృష్టిలో ఉంచుకొని అధిష్టానం ఈ బాధ్యత అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాయకులు అందరు హర్షం వ్యక్తం చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బిక్కు నాయక్,సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.