యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే దేశాభివృద్ధి - దేవరకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం

దేవరకొండ 13జూలై (BVK 3 న్యూస్ ) : మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), దేవరకొండలో ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ జి. కోటయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంఖ్యలో యువత మన దేశంలో ఉన్నారు. జనాభా పెరిగే కొద్దీ అనేక సమస్యలు, సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ యువత వివిధ రంగాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని, సంపద సృష్టించే సామర్థ్యాన్ని అలవరచుకుంటే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది," అని...