గుడిపల్లిలో జాతీయ నూలు పురుగుల నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహణ
దేవరకొండ 13జూలై (BVK 3 న్యూస్ ) : గుడిపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాల వేదికగా జాతీయ నూలు పురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గుడిపల్లి సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుడిపల్లి పీహెచ్‌సీ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, 1 నుండి 19 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలందరికీ నూలు పురుగుల నివారణ కోసం ప్రభుత్వం ఈ మాత్రలను ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. ఈ మాత్రలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు నూలు పురుగుల...