నారాయణపేటలో ఉత్సాహంగా జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం
- జనసేనలోకి భారీగా చేరికలు.. - కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, డాక్టర్ మణికంఠ గౌడ్ లు నారాయణపేట, జూలై 13 (బివికె న్యూస్) నారాయణపేట జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సోమవారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. నాయకులు, కార్యకర్తల కలయికతో జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చి పార్టీలో చేరడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమ నిర్వాహకులు మరియు అతిథులు ఈ ప్రతిష్టాత్మక సమావేశాన్ని నారాయణపేట జిల్లా నాయకులు, మక్తల్...