నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా మద్దిమడుగు రామస్వామి నియామకంపై హర్షం - దేవరకొండ ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు.
దేవరకొండ 14జూలై (BVK 3 న్యూస్ ) : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా నూతనంగా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది శ్రీ మద్దిమడుగు రామస్వామి , తమ నియామకానికి సహకరించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి, అలాగే తనకు నిరంతరం అండగా నిలుస్తున్న దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.పార్టీ బలోపేతం కోసం మరియు ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన అనుభవంతో నిరంతరం శ్రమిస్తానని, పార్టీ గెలుపులో తనవంతు పాత్రను పోషిస్తానని రామస్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక...