"పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి" - మున్సిపల్ కమిషనర్ రామాదుర్గ రెడ్డి
దేవరకొండ 14జూలై (BVK 3 న్యూస్ ) : "సమాజ ఆరోగ్యమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న మన పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. వారి ఆరోగ్యం, భద్రత పట్ల పురపాలక సంఘం పూర్తి కట్టుబడి ఉంది. వృత్తిపరమైన ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, పని చేసే సమయంలో పీపీఈ కిట్లను తప్పనిసరిగా ధరించాలి," అని మున్సిపల్ కమిషనర్ రామాదుర్గ రెడ్డి సూచించారు.పురపాలక సంఘం దేవరకొండ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 'నమస్తే డే' కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం మరియు భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పీపీఈ కిట్ల పంపిణీ: 'నమస్తే' పథకం కింద అర్హులైన పారిశుద్ధ్య కార్మికులకు...