పత్రికా ప్రకటన, తేది:17-07-2026, నారాయణ పేట జిల్లా,
మూడ్ మల్ మెగాలిథిక్ మెన్హిర్ సైట్ అభివృద్ధికి చర్యలు ----- జిల్లా కలెక్టర్ తో దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ భేటీ. నారాయణ పేట జిల్లా కృష్ణా మండలంలోని మూడ్ మల్ బృహత్ శిలా ఫలకాల (మెగాలిథిక్ మెన్హిర్) ప్రదేశానికి సంబంధించిన సర్వే నంబర్ల పరిధిలో ఉన్న మొత్తం ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక తహసీల్దార్‌ను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్, హెరిటేజ్ తెలంగాణ కార్యాలయ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ నాగ లక్ష్మీ బృందం కలెక్టర్ ప్రియాంకతో భేటీ అయ్యారు....