మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థత నుండి కోలుకోవాలని పడమటి అంజన్న ఆలయంలో
కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక పూజలు. నారాయణపేట, జూలై 18 (బి వి కే న్యూస్) మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థత నుండి త్వరగా కోలు కోవాలని నియోజకవర్గంలో, మండల కేంద్రాలలో,మండల అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత మూడు రోజులుగా పాడి పరిశ్రమ మత్స్యశాఖ యువజన క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అకస్మాత్తుగా వైరల్ ఫీవర్ తో అస్వస్థత గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు మంత్రిని కేర్ హాస్పిటల్ లో చేర్చగా డాక్టర్లు అన్ని పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. నియోజకవర్గంలోని కృష్ణ.మాగనూరు. ఉట్కూర్. నర్వ. అమరచింత.ఆత్మకూర్ మండల కేంద్రంలోని పురాతన ప్రముఖ ఆలయాల్లోను మంత్రి కులదైవ మైన అతి పురాతనమైన శ్రీ...