వాహనాలను ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచుకోవాలి: ఎం టి ఓ ఆర్ఐ విజయభాస్కర్
నారాయణపేట, జూలై 18 (బి వి కే న్యూస్) నారాయణపేట జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో శనివారం రోజు MTO, ఆర్ఐ విజయభాస్కర్ పోలీసు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉపయోగించే ప్రతి పోలీసు వాహనం ఎల్లప్పుడూ సాంకేతికంగా మెరుగైన స్థితిలో ఉండేలా చూసుకోవాలని, వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని పోలీసు డ్రైవర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీసు వాహనాలు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల వాటిని ప్రతిరోజూ శుభ్రపరచడంతో పాటు ఇంజిన్, బ్రేకులు, టైర్లు, లైట్లు, సైరన్, బ్యాటరీ తదితర భాగాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని తెలిపారు. చిన్నచిన్న లోపాలు కనిపించిన...