మంత్రి వాకిటి శ్రీహరి ఆరోగ్యం కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు
నారాయణపేట జులై 18 ( బీవీకే న్యూస్ ) నారా యణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్థక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కోరుతూ శనివారం నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. మంత్రి వాకిటి శ్రీహరి వైరల్ ఫీవర్ తో బాధపడుతూ కూడా అధికారిక కార్యక్రమంలో,పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు .దీంతో రెండు రోజుల క్రితం తీవ్ర అశ్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు మంత్రిని హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు .ప్రస్తుతం మంత్రి వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు .నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ...