ఘనంగా 41వ కారంచేడు దళిత మృత వీరుల దినోత్సవం

కారంచేడు,చుండూరు దళితుల త్యాగాల స్ఫూర్తితో దేశవ్యాప్త కులోన్మాద,మతోన్మాద దాడులను తిప్పికొడదాం - డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నియోజకవర్గం నారాయణపేట, జూలై 18 (బివికే న్యూస్) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో 41వ కారంచేడు దళిత మృతవీరుల దినోత్సవాన్ని సందర్భంగా ఘనంగా క్రొవ్వొత్తుల నివాళులర్పించారు. 1985 జూలై 17న ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలోని కమ్మ కులస్తులు మాదిగ వాడ మంచినీటి చెరువులో పశువులను స్నానం చేయించడాన్ని అడ్డుకున్న మాదిగలను అగ్రకుల అహంకారంతో కమ్మ కులస్తులందరూ ఏకమై పధకం ప్రకారం బరిసెలతో, కొడవళ్ళతో,కత్తులతో గోడ్డన్లతో మాదిగ వాడ పై పడి మహిళలను...