మున్సిపల్ కార్మికుల వేతనాలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఎండార్స్మెంట్ ను రద్దు చేయాలి

ఎస్ కిరణ్ టి యూ సి ఐ జిల్లా అధ్యక్షులు నారాయణపేట, జూలై 18 (బి వి కె న్యూస్)   మున్సిపల్ కార్మికులకు వేతనాలు తగ్గిస్తూ ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వం ఎండార్స్మెంట్ విడుదల చేసింది. దీని వ్యతిరేకంగా టియుసిఐ ఆధ్వర్యంలో శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నెలరోజుల క్రితం కార్మికులకు జీవో నెంబర్ 6 విడుదల చేసింది. దీంట్లో మూడు జోన్లుగా అనగా  1)మున్సిపల్ కార్పొరేషన్, 2)మున్సిపాలిటీ, 3)గ్రామీణ ప్రాంతం గా విభజన చేసింది. దీనికనుగుణంగా ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్  కార్మికులకు వేతనం నిర్ణహిస్తూ మున్సిపాలిటీలకు ఎండార్స్మెంట్ విడుదల చేసింది.  ప్రస్తుతం అమలు అవుతున్న...