శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన ట్రస్ట్ ఎన్నిక
ఆలయ అధ్యక్షులుగా బండారు సుధాకర్ (రాము) ప్రధాన కార్యదర్శిగా మారం భాస్కర్ రెడ్డి, కోశాధికారిగా పాంపాటి శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక దేవరకొండ 18జూలై (BVK 3 న్యూస్ ) : శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన ట్రస్టును ఏర్పాటు చేసే క్రమంలో శనివారం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బండారు సుధాకర్( రాము), ప్రధాన కార్యదర్శిగా మారం భాస్కర్ రెడ్డి, కోశాధికారిగా పాంపాటి శ్రీధర్ లను పెద్దలు కమిటీ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొండమల్లేపల్లి పట్టణంలోని హైదరాబాదు రోడ్డులో గల మల్లెల గట్టు పై శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి...