అక్షర ఆణిముత్యాలచే వ్యవసాయం పైన ప్రత్యక్ష అవగాహన కార్యక్రమం
నారాయణపేట, జూలై 18 (బి వి కె న్యూస్) నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని అక్షర హై స్కూల్ పాఠశాలలో శనివారం అక్షర ఆణిముత్యాలచే వ్యవసాయం పైన ప్రిన్సిపల్ రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పాఠ్యాంశాల బోధననే కాకుండా వారికి ప్రత్యక్ష అనుభవం నిమిత్తం వ్యవసాయ క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులతో కలిసి వరి నాట్లు వేసి, వ్యవసాయ పనులను ప్రత్యక్షంగా సందర్శించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు వరి సాగు విధానాలు, నాట్లు వేయు పద్ధతి, నీటి నిర్వహణ, రైతులు ఎదుర్కొనే సవాళ్లు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతపై విద్యార్థులకు...