మొజ్తాబా ఖమేని ఇరాన్‌లో లేడా..
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అనే అంశంపై అనేక సందేహాలున్నాయి. ఆయన ఇరాన్‌లో ఉన్నారని కొందరు అంటుంటే.. రష్యాలో చికిత్స తీసుకుంటున్నారని ఇంకొందరు భావిస్తున్నారు. ఆయన స్థావరం విషయంలో స్పష్టత లేదు. అధికారికంగా ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. కానీ, తాజాగా ఈ అంశంపై సౌదీ సంచలన ప్రకటన చేసింది. మొజ్తాబా ఖమేని ఇరాన్‌లో లేడని సౌదీకి చెందిన అల్ హదాత్ అనే వార్తాసంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ భద్రతా దళాలు కూడా ధ్రువీకరించాయి. ఇరాన్‌లో లేడని చెప్పినప్పటికీ, ఎక్కడున్నాడు అనే విషయంలో స్పష్టత మాత్రం లేదు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడిలో...