నేరడుగోమ్ము మోడల్ స్కూల్‌లో ఘనంగా పేరెంట్-టీచర్స్ మీటింగ్

దేవరకొండ 19జూలై (BVK 3 న్యూస్ ) : స్థానిక నేరడుగొమ్ము మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో శనివారం తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ప్రిన్సిపాల్ అజ్మీరా కోటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి,విద్యార్థుల విద్యా ప్రగతికి సంబంధించి ఎజెండాలో పొందుపరిచిన పలు ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) శాతాన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తల్లిదండ్రులతో కలిసి కార్యాచరణను చర్చించారు.విద్యార్థుల చదువుల నాణ్యత, పరీక్షల్లో వారి ప్రతిభ మరియు తరగతి గదుల్లో వారి ప్రగతిని ప్రదర్శిస్తూ ఉపాధ్యాయులు...