దేవరకొండలో సీజ్ చేసిన వాహనాల బహిరంగ వేలం: ₹3.77 లక్షల ఆదాయం

దేవరకొండ 20జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ జిల్లా పంచాయతీ అధికారితో డీపీఈఓ కలిసి దేవరకొండ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో సోమవారం పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ మాట్లాడుతూ మొత్తం 10 వాహనాలకు వేలం పాట నిర్వహించినట్లు తెలిపారు.ఈ వాహనాల ప్రారంభ ధర (అప్సెట్ వ్యాల్యూ) ₹2,66,000గా నిర్ణయించగా,బహిరంగ వేలంలో పోటీపడి ₹3,20,000 పలికినట్లు వెల్లడించారు.దీనికి తోడు ₹57,600 జిఎస్టి రూపంలో వసూలైందని, వేలం పాట,జిఎస్టి కలిపి మొత్తంగా ₹3,77,600 ప్రభుత్వం సేకరించిందని తెలిపారు.పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలంలో పలువురు బిడ్డర్లు పాల్గొని వాహనాలను దక్కించుకున్నారని స్థానిక పోలీసులు తెలియజేశారు.