వేములవాడ రాజన్నకు భక్తుడి రూ.7 లక్షల విరాళం - 'హెల్త్ కండీషన్ బాలేదు' ప్లీజ్ తిరిగిచ్చేయండంటూ కుమార్తెల రిక్వెస్ట్
: ఆ దంపతులు తమ ఏడుగురు కుమార్తెలందరికీ వివాహాలు చేసి, జీవిత చరమాంకానికి చేరుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పరమ భక్తులైన వారు, తమ దగ్గరున్న డబ్బునంతా రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు డొనేషన్ కింద అందజేశారు. అయితే తమ నాన్నకు మతి స్థిమితం సరిగా లేదంటూ ఆయన కుమార్తెలు తర్వాత ఆలయానికి వచ్చి విరాళం వెనక్కి ఇవ్వాలని అడిగిన ఉదంతమిది. వారి అంగీకారం మేరకే తీసుకున్నాం : వేములవాడకు చెందిన వృద్ధ దంపతులు సోమవారం రాజన్న ఆలయానికి రూ.7,01,116ను విరాళంగా సమర్పించారు. ఆలయ పర్యవేక్షకుడు శ్రీనివాస్ శర్మ, ప్రొటోకాల్ పర్యవేక్షకుడు శ్రీనివాస్‌లు వారికి రసీదును అందజేశారు. అయితే తమ తండ్రికి మతిస్థిమితం...