'విద్యార్థుల వెంటే ప్రభుత్వం- నీట్​ పేపర్​ లీక్​ దోషులపై కఠిన చర్యలు'- NDA మీటింగ్​లో మోదీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్​ పేపర్ లీక్​ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా స్పందించారు. ఇది జాతీయ సమస్య అని, దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. దిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో 'మంగళ్ మిలన్' పేరుతో జరిగిన ఎన్​డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సమావేశం అనంతరం ఎన్​డీఏ నేతలకు, ఎంపీలకు ప్రధాని మోదీ చేసిన కీలక సూచనలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్​ రిజిజు మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో నీట్‌ పరీక్ష పేపర్ లీక్‌, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు), దేశ ఆర్థిక పురోగతి తదితర అంశాలపై...