స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య నిర్ణయం- కొత్త లెక్కలు, 'డైరెక్ట్' వార్..!?

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి వర్సస్ వైసీపీ మధ్య రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతోంది. మూడు పార్టీల సమన్వయం పైన ముఖ్య నేతలు ఫోకస్ చేసారు. సీట్ల పంపకాల పైన అధినేతలు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని సీఎం చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొస్తోంది. దీంతో.. ఇప్పుడు ఈ నిర్ణయం పార్టీలకు కీలకంగా మారనుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నిక లు నిర్వహించాలని భావిస్తోంది. ఇందు కోసం పార్టీ నేతలకు ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సీఎం...