నా ఇన్సూరెన్స్ డబ్బులతో డాడీకి ట్రీట్మెంట్ చేయించు మమ్మీ..
ఏపీలోని నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి అనారోగ్యంతో మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. తాను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో డాడీకి ట్రీట్మెంట్ చేయించండి అని ఓ సూసైడ్ నోట్ కూడా రాసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీపతి సాయి చందన ప్రియ (27) చిల్లకూరు మండలం తోనుకుమల సచివాలయం పరిధిలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తోంది. ఏడాది క్రితం బదిలీపై వచ్చిన సాయి చందన ప్రియ ఇటీవల సచివాయంలో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివిధ...