పరిమితి మించితేనే..

‘పామాయిల్‌’ మాట వినిపించగానే చాలామంది విష తుల్యంగా భావించి దాంతో చేసిన ఆహారాన్ని వెంటనే పక్కన పెట్టేస్తున్నారు. అంతలా ప్రభావితం చేశారు మరి నేటి సోషల్‌మీడియా సైంటిస్టులు. అయితే సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒక నూనె ఆరోగ్యకరమా కాదా అనేది నూనె పేరును చూసి కాకుండా.. దాన్ని ఎలా వాడుతున్నాం, ఎంత మోతాదులో తీసుకుంటున్నాం.. ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు. పామాయిల్‌ విటమిన్‌-ఇ తోపాటు శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. అలా అని పరిమితికి మించి తీసుకోమని కాదు. అన్ని రకాల నూనెలను మారుస్తూ, పరిమిత...