‘మంగళవారం 2’పై అజయ్ భూపతి బిగ్ అప్డేట్..
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన మేకింగ్ స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడిగా సంచలన విజయాన్ని అందుకున్న ఆయన, ‘మహాసముద్రం’ తో నిరాశపరిచినా, ‘మంగళవారం’ చిత్రంతో మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఆ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రషా తడానీ హీరోయిన్గా నటిస్తుండగా, మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. ఈ...