పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో ఉద్రిక్త‌త‌లు మ‌రింత తీవ్రం..

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK) లో ఉద్రిక్తత‌లు మ‌రింత తీవ్ర‌మ‌య్యాయి. అవామీ యాక్షన్ కమిటీ (Awami Action Committee) ముజఫరాబాద్ (Muzafarabad) కు చేపట్టిన లాంగ్ మార్చ్‌ (Long March) కు ముందు సోమవారం పలుచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఐదుగురు నిరసనకారులు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రావల్‌కోట్‌, చాందినీ చౌక్, ఖస్సాయి గలి, బల్దియా అడ్డా ప్రాంతాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపాయి. అయినప్పటికీ నిరసనకారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రావల్‌కోట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రహదారులను మూసేసి, భారీగా బలగాలను మోహరించి, లాంగ్...