‘రామాయణ’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్?..

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో రామాయణ ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్న ఈ భారీ పౌరాణిక చిత్రానికి ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు సహా పలు భారతీయ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ప్రచార పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, ఇప్పుడు సినిమా ట్రైలర్‌కు సంబంధించిన తాజా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట ఈ చిత్రం ట్రైలర్‌ను గత వారం విడుదల చేయాలని...