టమోటా కిలో రూ.10లోపే..
టమోటా రైతులకు ఈసారి ఆదిలోనే హంసపాదు అన్న పరిస్థితి ఎదురవుతోంది. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికొచ్చిన సమయంలో ధరల పతనం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సీజన్ ప్రారంభంలోనే పరిస్థితులు తలకిందులు కావడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేలా కనిపించలేదని కన్నీరుపెడుతున్నారు. కష్టపడి పండించిన పంటను మార్కెట్కు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోతోందని వాపోతున్నారు. చేసేదిలేక పంటను తోటలోనే వదిలేయడం, లేదంటే రోడ్లపక్క పారబోసే దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొన్నేళ్లుగా టమోటా సాగు బాగా పెరిగింది. సాధారణంగా సీజన్ ప్రారంభంలో ధరలు ఆశాజనకంగా ఉంటాయి. దీంతో రైతులు ముందస్తుగా పంట సాగు చేస్తున్నారు. మే, జూన్లో...